ETV Bharat / city

భారతీయుడి సత్తా చూపిన వీరుడు అల్లూరి: చంద్రబాబు - చంద్రబాబు

అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు శ్రద్ధాంజలి ఘటించారు. విశాఖ మన్యం నుంచి మహోగ్రరూపంలా గర్జించిన గొప్ప వీరుడు అల్లూరి సీతారామరాజు అని చంద్రబాబు కొనియాడారు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించిన మహనీయుని త్యాగం మరువలేనిదని బాబు అన్నారు.

cbn on alluri birthday
అల్లూరి సీతారామరాజు జయంతి
author img

By

Published : Jul 4, 2021, 1:34 PM IST

స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు, స్వతంత్ర భారతావని ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆ మహానుభావుని సేవలను మనసారా స్మరించుకుంటున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. అల్లూరి జయంతి సందర్భంగా ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.

విశాఖ మన్యం నుంచి మహోగ్రరూపంలా గర్జించి.. భారతీయుని సత్తా ఏంటో చూపిన వీరుడని బాబు కొనియాడారు. వందేమాతరం అంటూ.. సాయుధ పోరాటంతో బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించి స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఉరకలెత్తించిన మహనీయుని త్యాగం అనిర్వచనీయమని అన్నారు. తెలుగుదేశం హయాంలో సీతారామరాజు జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించి నివాళులర్పించినట్లు గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

KRISHNA WATER: కడలిలోకి కృష్ణమ్మ.. రోజూ అర టీఎంసీ వృథా

టీకా పంపిణీలో భారత్​ మరో మైలురాయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.