వైకాపా పాలనలో వ్యవసాయం రంగం(agriculture sector) పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోయిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ సహకారం లేక రైతులు ఆత్మహత్యలు(farmers suicide) చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువుల కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటరీ రైతు సంఘాల నేతలతో భేటీ అయిన చంద్రబాబు..పార్టీలో కష్టపడి పని చేసినవారికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందని.. సాగు రంగం బాగుపడాలంటే మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని తెలిపారు.
రాష్ట్రంలో జోరుగా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందని ఇటీవలే రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడిందని.. సీఎం జగన్ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ మళ్లీ ప్రశాంత్ కిశోర్ భజన చేస్తున్నారని.. వైకాపా ఎన్ని ప్రయోగాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు చెప్పారు.
ఇదీ చదవండి: