తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టును.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. అచ్చెన్నాయుడు అరెస్టు జగన్ కక్ష సాధింపునకు పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు. ఉత్తరాంధ్రపై జగన్ కక్ష కట్టారని.. శ్రీకాకుళం జిల్లాలో భయాందోళనలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో గత 40 ఏళ్లలో ఇలాంటి ఉద్రిక్తతలు లేవని.. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఉద్రిక్తతలు సృష్టించిందెవరని చంద్రబాబు ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు పెట్టకుండా అచ్చెన్నాయుడిపై పెడతారా అని ధ్వజమెత్తారు.
రామతీర్థం ఘటనలోనూ తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు
రామతీర్థం ఘటనలో తనపై, కళా వెంకట్రావు, అచ్చెన్న, కూన రవికుమార్, వెలగపూడి సహా చాలామందిపై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. సబ్బం హరి ఇల్లు, గీతం వర్శిటీ భవనాలను ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమంగా నిర్బంధించారు
గతంలో అచ్చెన్నాయుడిని 83 రోజులు అక్రమంగా నిర్భంధించారని.. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని అమానుషంగా 5 జిల్లాల్లో తిప్పారని ఆవేదన చెందారు. తక్షణమే అచ్చెన్నాయుడిని బేషరతుగా విడుదల చేసి ఆయనపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
హింసాకాండపై ధ్వజమెత్తడమే అచ్చెన్న చేసిన తప్పిదమా? అక్రమ అరెస్టుకు తగిన మూల్యం జగన్ చెల్లించక తప్పదు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు బుద్ధి చెబుతారు.
-చంద్రబాబు, తెదేపా అధినేత
అచ్చెన్నాయుడి అరెస్టు రాజారెడ్డి రాజ్యాంగానికి పరాకాష్ట: లోకేశ్
ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే అక్రమ అరెస్టులు చేశారని నారా లోకేశ్ అరోపించారు. అచ్చెన్న ఇంటిపైకి వైకాపా నేత రాడ్లు, కత్తులతో దాడికి వెళ్లారని.. దువ్వాడ శ్రీనివాస్, ఆయన అనుచరులపై కనీసం కేసు కూడా పెట్టలేదని ఆగ్రహించారు.
ఇదీ చదవండి: