ETV Bharat / city

అమరావతి భూములు అమ్మే హక్కు.. ఈ ముఖ్యమంత్రికి ఎక్కడిది: చంద్రబాబు - chandrababu meeting over Amaravati lands sales

Chandrababu News: రాజధాని అమరావతి పరిధిలో ఉద్యోగుల కోసం నిర్మించిన ఇళ్లను ప్రైవేట్ సంస్థలకు అద్దెకు ఇవ్వడం సరికాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిని శ్మశానమని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని చంద్రబాబు నిలదీశారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ భేటీలో అనేక అంశాలపై చంద్రబాబు చర్చించారు.

Chandrababu Strategy Committee meeting
Chandrababu Strategy Committee meeting
author img

By

Published : Jun 27, 2022, 4:58 PM IST

chandrababu strategy meeting: రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని సీఎం జగన్‌కు ఆ ప్రాంత భూములు విక్రయించే హక్కు ఎక్కడిది అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిని శ్మశానమని చెప్పిన ఈ ప్రభుత్వం.. ఇప్పుడు ఎకరా రూ.10 కోట్లకు ఎలా అమ్మకానికి పెడుతుందని నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలను మూడేళ్లుగా పూర్తి చేయకుండా ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అద్దెకు ఇచ్చే యత్నాన్ని చంద్రబాబు తప్పుబట్టారు.

ఈ మేరకు పార్టీ ముఖ్యనేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. వైకాపా విధానాలపై తనదైన శైలిలో చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నిధుల్లేక దుల్హన్ పథకం నిలిపివేశామంటూ కోర్టుకు చెప్పడం దారుణమన్నారు. ఈ-క్రాప్​లో వైకాపా కార్యకర్తల పేర్లు నమోదు చేశారన్న చంద్రబాబు.. పంట నష్టపోయిన రైతులకు మొండిచేయి చూపించారని ఆక్షేపించారు. దుకాణాల్లో విక్రయించే మద్యం నాణ్యతపై ప్రభుత్వం జవాబు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

ఆత్మకూరు ఉపఎన్నికలో డబ్బులు పంచినా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోయినా వైకాపాకు ఓట్లు పెరగలేదు. దీనికి ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే ప్రధాన కారణం. గత ఎన్నికలతో ఉప ఎన్నికను పోల్చి చూస్తే వైకాపాకు కనీసం 10 వేల ఓట్లు కూడా అదనంగా పడలేదు. పన్నులతో వాతలు.. పథకాలకు కోతలు.. అనేలా జగన్ పాలన సాగుతోంది. ప్రజలకు అందే పథకాల్లో రకరకాల నిబంధనల పేరుతో కోతలు పెట్టి డబ్బులు మిగుల్చుకుంటున్నారు. చెత్త దగ్గర నుంచి మొదలు అన్నింటిపైనా పన్నులు వేసి వాతలు పెడుతున్నారు. పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు కొత్త కొత్త నిబంధనలతో కోతలు వేస్తోంది. ఒంటరి మహిళల పింఛన్‌ వయసు నింబంధనను 50 ఏళ్లకు పెంచి లబ్ధిదారుల సంఖ్యను లక్షల్లో తగ్గించడం అమానవీయం. -చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.