Chandrababu letter to DGP Goutham Sawang: తెదేపా నాయకులు పులి మరియదాస్‌ల అలియాస్ చిన్నాకు వైకాపా గూండాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. గుంటూరు జిల్లా తాడికొండలోని తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పులి చిన్నా.. అధికార పార్టీకి చెందిన గూండాల నుంచి ప్రాణహాని ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.
చిన్నా.. వైకాపా ఎంపీ నందిగాం సురేష్‌కి దూరపు బంధువు అని చంద్రబాబు వెల్లడించారు. పులి చిన్నా తెదేపాలో క్రియాశీలకంగా ఉండటంతో..ఎంపీ నందిగం సురేష్ ఆయనపై పగ పెంచుకున్నారని లేఖలో ఆరోపించారు. ఎంపీ నందిగాం సురేష్ ఆదేశాలతో పులి చిన్నాపై 30 వరకూ కేసులు పెట్టారని.. అతడిని చంపాలనే ఉద్దేశ్యంతో ప్రతిరోజూ అతని కదలికలు, ఇంటిపై నిఘా ఉంచారని లేఖలో వెల్లడించారు. ఈ వేధింపులకు పరాకాష్టగా.. సెప్టెంబర్ 18న ఉద్దండరాయునిపాలెం గ్రామ సమీపంలో చిన్నాపై ఎంపీ అనుచరులు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు.. మరియదాస్ కుటుంబ సభ్యులను, బంధువులను చంపేస్తామని వైకాపా గూండాలు బెదిరిస్తున్నారని తెలిపారు. పులి చిన్నాకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం, ఎంపీ నందిగాం సురేష్ బాధ్యత వహించాలన్నారు. పులి చిన్నాకు ఎలాంటి హాని జరగకుండా పోలీసు రక్షణ కల్పించాలని లేఖలో కోరారు. పోలీసుల సత్వర చర్యలే పులి చిన్నా ప్రాణానికి రక్షణ కల్పిస్తుందని లేఖలో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
chandra babu kuppam tour: ఎస్సీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోం : బాబు