ETV Bharat / city

'సముద్రంలో గల్లంతైన జాలర్ల ఆచూకీ కనిపెట్టండి..' చంద్రబాబు లేఖ

CBN Letter to CS: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(APCS) సమీర్​ శర్మకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మచిలీపట్నానికి చెందిన జాలర్ల ఆచూకీ కనిపెట్టాలని కోరారు. మత్స్యకారుల తప్పిపోయి నాలుగు రోజులైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని మండిపడ్డారు.

CBN Letter to CS
CBN Letter to CS
author img

By

Published : Jul 6, 2022, 5:11 PM IST

సముద్రంలో చేపల వేటకు వెళ్లి కనిపించకుండాపోయిన కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన నలుగురు జాలర్ల ఆచూకీ కనిపెట్టాలని సీఎస్​ సమీర్​ శర్మను తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈమేరకు సీఎస్​కు చంద్రబాబు లేఖ రాశారు. వేటకెళ్లిన మత్య్సకారులు గల్లంతుకావడంతో ఆ కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. వేటగాళ్ల ఆచూకీ కనిపెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. అవసరమైతే లాంగ్‌ రేంజ్‌ డ్రోన్‌లతో గాలించాలని సూచించారు.

మత్స్యకారులు తప్పిపోయి నాలుగు రోజులైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని చంద్రబాబు మండిపడ్డారు. రెండు రోజుల క్రితం స్థానిక జాలర్లు రెండు బోట్లు వేసుకుని సముద్రంలో గాలించినా ఎలాంటి ఉపయోగమూ లేకపోయిందని చంద్రబాబు వాపోయారు. జాలర్ల గల్లంతుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని.. వెంటనే వారి ఆచూకీ కనిపెట్టేలా చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు.

CBN Letter to CS
సీఎస్​కు చంద్రబాబు లేఖ

మచిలీపట్నం మండలం క్యాంబెల్​పేటకు చెందిన నరసింహారావు, చిన మస్తాన్‌, నాంచార్లు, వెంకటేశ్వరరావు.. సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. గత నాలుగు రోజుల నుంచి వారి ఆచూకీ తెలియడంలేదు. వాళ్లు ఎక్కడ ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలీక వారి కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి: లభించని మత్స్యకారుల ఆచూకీ.. ఆందోళనలో కుటుంబసభ్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.