జాతీయ ప్రజాస్వామ్య కూటమికి వ్యతికరేకంగా రాజకీయ పక్షాలను ఏకం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.. దిల్లీలో మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో 20 నిమిషాలపాటు సమాలోచనలు చేశారు. ఇప్పటికే.. పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీ, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ తో మంతనాలు చేశారు. డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సహా పలువురు నేతలతో పలు సందర్భాల్లో చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రతికూల పరిస్థితి ఉన్నట్లు అంచనా వేస్తున్న చంద్రబాబు ... ప్రతిపక్షాలను కలుపుకుని వెళ్లేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఈ నెల 19 తర్వాత దిల్లీలో అన్ని పార్టీల నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు యోచిస్తున్న చంద్రబాబు... ఈ నెల 21న విపక్ష నేతలతో దిల్లీలో భేటీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు దిల్లీ వర్గాలంటున్నాయి.
ఇది కూడా చదవండి.