ETV Bharat / city

వైకాపాది అధర్మ యుద్ధం.. విలువలు ఉన్న పార్టీలా ఎప్పుడూ పోరాడలేదు: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్

CBN on YSRCP: వైకాపాది అధర్మ యుద్ధం.. విలువలు ఉన్న పార్టీలా ఎప్పుడూ పోరాడలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించడమే వారి సిద్ధాంతమని దుయ్యబట్టారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : Jun 9, 2022, 9:55 PM IST

Babu on YSRCP: అధికార వైకాపాది ఎప్పుడూ అధర్మ యుద్దమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించటమే వైకాపా సిద్ధాంతమని ధ్వజమెత్తారు. నాడు అధికారం కోసం ఎలా అయితే తప్పుడు అరోపణలు, అసత్య ప్రచారాలు చేశారో ఇప్పుడు కూడా అదే పంథాలో పని చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను మరింత సమర్థంగా.., ఎటాకింగ్​గా తూర్పారబట్టాలని అధికార ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి, ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి మీడియాతో పాటు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో చంద్రబాబు అధికార ప్రనినిధులు, నేతలతో వర్క్​షాప్ నిర్వహించారు. నిరంతరం అప్డేట్ అవుతూ లోతైన కసరత్తుతో పార్టీ అధికార ప్రతినిధులు గళం వినిపించాలని సూచించారు. మీడియాలో మాట్లాడటమే కాకుండా ఆయా అంశాలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనను కూడా ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. అన్ని వేదికలపై వైకాపా దురాగతాలను ఎండగట్టాలని సూచించారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.