పద్మభూషణ్, పద్మశ్రీ సాధించిన తెలుగు వారికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. పీ.వీ.సింధుకు పద్మభూషణ్ అవార్డు రావడం యావత్ దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ.. సిక్కోలు కళలకే గొప్ప గౌరవమన్నారు. చలపతిరావుకు పద్మశ్రీ.. అనంతపురం జానపద కళలకే విశేష గుర్తింపు తెచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణకు చెందిన రైతు చింతల వెంకటరెడ్డి, సాహితీవేత్త శ్రీ భాష్యం విజయసారథికి పద్మశ్రీ అవార్డుల రావడం సంతోషంగా ఉందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేందుకు దోహదపడాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఇదీ చదవండి: