ETV Bharat / city

ధర్మనిబద్ధతలో రాముడిని మించిన వారు లేరు: చంద్రబాబు - sri rama navami celebrations

శ్రీరాముడంటే మనిషిలోని సుగుణాలకు ప్రతిరూపమని.. ధర్మనిబద్ధతలో రాముడిని మించిన వారు లేరని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. తెలుగువారందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.

sri rama navami celebrations
శ్రీరామనవమి శుభాకాంక్షలు
author img

By

Published : Apr 21, 2021, 10:30 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... తెలుగువారందరికీ​ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముడంటే మనిషిలోని సుగుణాలకు ప్రతిరూపమని, ధర్మనిబద్ధతలో రాముడిని మించిన వారు లేరని చంద్రబాబు అన్నారు. తన కుటుంబ సౌఖ్యం కంటే ప్రజల ఆనందమే ముఖ్యమని భావించేవాడు ఉంటే అది ఎప్పటికీ రామరాజ్యమే అవుతుందని చంద్రబాబు అన్నారు.

సమాజంలో ఒక ఉత్తమ వ్యవస్థను నెలకొల్పడానికి తన జీవిత సుఖాలను శ్రీరాముడు త్యాగం చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సీతారాముల దీవెనలతో తెలుగువాాారందరికీ సకల శుభాలు కలగాలని లోకేశ్ అభిలాషించారు. సామాన్యులు, శరణు కోరిన వారి పట్ల శాంతస్వభావిగా, కరుణామూర్తిగా కనిపించిన రాముడే... అవసరమైనప్పుడు దుర్మార్గులను కఠినంగా శిక్షించాడన్నారు. మంచినీ, చెడునీ ఎలా చూడాలో రామకథ ద్వారా పెద్దలు చెప్పాలని లోకేష్ తెలిపారు.

ఇదీ చూడండి:

ప్రజలకు మోదీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.