వరుసబెట్టి ప్రజల ప్రాణాలు హరిస్తున్న ప్రమాదాలు మనసును కలచివేస్తున్నాయి. విశాఖలో విషవాయువు 12 మందిని బలి తీసుకున్న ఘటన జరిగి వారం తిరక్కముందే ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర మరో ఘోరప్రమాదంలో 9 మంది వ్యవసాయకూలీలు మరణించారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతిచెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన వారంతా కూలీలు కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారి కుటుంబాలకు అండగా నిలవాలి. అలాగే క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలి.
-నారా చంద్రబాబు నాయుడు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల దగ్గర జరిగిన ఘోరప్రమాదంలో 9 మంది మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. స్థానిక తెలుగుదేశం నాయకులను ఆరాతీయగా ప్రమాదానికి గురైన వారంతా మిరపకోతకు వెళ్ళొస్తున్న వ్యవసాయకూలీలని తెలిసింది. ఇది చాలా బాధాకరం. లాక్ డౌన్ కష్టాల నుంచి వెసులుబాటు దొరికి ఇప్పుడిప్పుడే పనులకు వెళ్తున్న సమయంలో ఇలా జరగడం దారుణం. మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
-నారా లోకేశ్
ఇదీ చదవండి: విద్యుత్ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు