వలస కార్మికులు ఉపాధి లేక ఆకలి దప్పులతో అవస్థలు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులకు సహాయం చేయాల్సిందిపోయి దాడి చేయడమేంటని ప్రశ్నించారు. నిన్న సీఎం ఇంటి సమీపంలో కూడా దాడి చేశారని తెలిపారు. కేంద్రం, సుప్రీంకోర్టు సూచనల మేరకు వాళ్లకు భోజనం, వసతి కల్పించాలని గుర్తు చేశారు. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలని చంద్రబాబు కోరారు.
ఇదీ చదవండి: వలస కార్మికులపై పోలీసు 'లాఠీ' కాఠిన్యం