రైతుల సంక్షేమం కోసం తెదేపా అమలు చేసిన పథకాలు(scheemes) కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించి వ్యవసాయాభివృద్ధికి సహకరించాలని.. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. రైతులకు(farmers) ఏరువాక శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. భూమాత పూజతో వ్యవసాయ పనులకు ఉత్సాహంగా శ్రీకారం చుట్టిన అన్నదాతలు మంచి పంట ఉత్పత్తులు సాధించాలని కోరారు. విస్తారంగా వర్షాలు కురిసి రైతు ఇంట సిరులు పండాలని ఆకాంక్షించారు. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటూ.. రైతే రాజు కావాలని కోరుకున్నారు. తమ హయాంలో.. ఏరువాకను పండుగలా నిర్వహించి పండిన పంటకు మద్దతు ధరతో పాటు ప్రోత్సాహకాలు ఇచ్చామని గుర్తుచేశారు.
ఇదీ చదవండి: 'ఆ దూరాన్ని తగ్గించే బాధ్యత కేంద్రానిదే'