ETV Bharat / city

విద్యాశాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్

Babu on Municipal Schools: విద్యాశాఖలోకి మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పురపాలక స్కూళ్ల విలీన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు
author img

By

Published : Jun 8, 2022, 5:42 PM IST

విద్యా శాఖలో మున్సిపల్ పాఠశాలల విలీనం ప్రభుత్వ కుట్ర అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 2,115 పురపాలక పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలని ఆరోపించారు. నాలుగున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్​ను పణంగా పెడతారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. విలీన ప్రతిపాదనపై మున్సిపల్ టీచర్ల పోరాటానికి తెదేపా మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.

మున్సిపల్ పాఠశాలలు పట్టణ ప్రాంతంలో పేద, బడుగు వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంతో కీలకంగా ఉన్నాయన్నారు. ప్రైవేటు స్కూల్స్ నుంచి కూడా మున్సిపల్ పాఠశాలకు అడ్మిషన్లు వస్తున్నాయని తెలిపారు. కొన్ని పురపాలక పాఠశాలల్లో సీట్లు లేక నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలీదా ? అని నిలదీశారు. నిన్నటి వరకు ఎయిడెడ్ పాఠశాలలను టార్గెట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మున్సిపల్ పాఠశాలల ఆస్తులపై కన్నేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మున్సిపల్ పాఠశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్​కు విరుద్దంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.