ETV Bharat / city

శ్రీలంక దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయి: చంద్రబాబు - చంద్రబాబు న్యూస్

శ్రీలంక దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. చేసిన అప్పులకు వడ్డీ కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని ఆక్షేపించారు. పోలవరంలో నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే చెప్పిందని..,వైకాపా ప్రభుత్వ వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకు తమపై ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీలంక దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నాయి

author img

By

Published : Jul 20, 2022, 9:47 PM IST

రాష్ట్రం మరో శ్రీలంక కావటం కాదనీ..., శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులు ఇప్పటికే ఏపీలో ఉన్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పనిచేసే ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని గుర్తు చేశారు. జీపీఎఫ్ కూడా విత్ డ్రా చేసుకునే పరిస్థితి వారికి లేదనీ.., పదవీ విరమణ చేసినవారికి చేయాల్సిన చెల్లింపులు కూడా సక్రమంగా చేయట్లేదని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్న చంద్రబాబు.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మూలధన వ్యయం ఎక్కడా లేకపోవటంతో రాష్ట్రాభివృద్ది కుంటుపడిందని మండిపడ్డారు. రహదారులకు మరమ్మతులు కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కాదా ? అని ప్రశ్నించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందన్న చంద్రబాబు.. పోలవరం విషయంలో తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు వైకాపా ప్రభుత్వం తెలుగుదేశంపై ఎదురుదాడి చేస్తోందని దుయ్యబట్టారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.