కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విజయవాడలో గతనెలలో సంగం డెయిరీ పాలకమండలి సమావేశం నిర్వహించటంపై... సంగం డెయిరీ మేనేజర్ శ్రీధర్‌పై పటమట పీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నోటీసులు ఇచ్చేందుకు విజయవాడ పోలీసులు గుంటూరులోని శ్రీధర్ స్వగృహానికి వెళ్లగా.. ఇంట్లో లేకపోవడంతో వెనుదిరిగారు. నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు మరోసారి గుంటూరు వెళ్లే అవకాశం ఉంది. ఈనెల 9వ తేదీన పటమట పీఎస్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
ఇదీ చదవండీ... వడ్డీ రాయితీ కింద ఇచ్చే సొమ్ముకంటే... ప్రచారం ఖర్చే ఎక్కువ: అనురాధ