తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఎమ్మెల్సీ అశోక్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఆలపాటి రాజా, తెనాలి శ్రవణ్‌కుమార్, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గ తెదేపా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సహా పలువురు తెదేపా నాయకులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు(murder cases on lokesh and tdp leaders) చేశారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్న జి.సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కిందా కేసు నమోదు చేశారు. ‘నేను డీజీపీ కార్యాలయంలో స్పాటర్‌గా విధులు నిర్వహిస్తున్నా. తెదేపా కేంద్ర కార్యాలయంలో గొడవ జరుగుతోందని తెలుసుకుని విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వెళ్లా. అక్కడున్న నేతలు ప్రశ్నిస్తే గుర్తింపు కార్డు చూపించా. అయినా వారు నన్ను కులం పేరుతో దూషిస్తూ, గొంతు నొక్కి చంపేందుకు ప్రయత్నించారు. వారు కొట్టిన దెబ్బలకు నేను స్పృహ కోల్పోయాను. వారు నా ఫోన్ పగలకొట్టి, నన్ను ఓ గదిలో బంధించారు. మంగళగిరి గ్రామీణ సీఐ వచ్చి నన్ను వారి నుంచి విడిపించి గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు’ అని సక్రూనాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మారణాయుధాలతో ప్రదర్శన, అల్లర్లు, అక్రమ నిర్బంధం, ఆయుధాలతో గాయపరచటం తదితర అభియోగాల్ని నిందితులపై(cases on lokesh and tdp leaders) మోపారు.
- జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఫిర్యాదుపై తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి గంజి చిరంజీవి, ఇతర నాయకులపై మంగళగిరి పోలీసులు బుధవారం కేసు నమోదుచేశారు. ఎన్‌హెచ్-16పై గుమికూడి రాకపోకల్ని స్తంభింపజేశారని, కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆత్మకూరు వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
ఇదీ చదవండి:
CM Jagan: వైకాపా సర్కారుపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోంది: సీఎం జగన్