భూ రికార్డుల ప్రక్షాళన కోసం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం ఇవాళ సచివాలయంలో భేటీ అయ్యింది. రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ నేతృత్వంలో మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్ సభ్యులుగా సబ్ కమిటీ భేటీ జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుత రెవెన్యూ సంబధిత సమస్యలపై చర్చించారు. సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలనకు కమిటీ పలు సూచనల చేసింది. 22 ఏ కింద ఉన్న భూములపై సరైన రీతిలో అధ్యయనం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఎస్టేట్, ఈనాం భూములపైనా కమిటీ చర్చించింది. వ్యవసాయ భూములను అతి తక్కువగా కనీస రుసుము చెల్లించి మార్పు చేసి విక్రయాలు చేస్తున్నారని కమిటీ అభిప్రాయపడింది. స్వాతంత్య్ర సమర యోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల విషయంలో ఉన్న సమస్యలు, ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ చేసి తగిన న్యాయం చేయాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఒక నెల రోజులు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించింది.
ఇదీ చదవండి: రాజధాని అంశంపై సీఎంకు లేఖ రాస్తా: కేంద్రమంత్రి అథవాలే