ETV Bharat / city

ప్రతి పౌరుడిలో జాతీయతా భావం.. ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా: సోము వీర్రాజు - national flag

Azadi ka Amrit Mahotsav:ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగుర వేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి కొత్త వంతెన సెంటర్ వరకు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఆయన.. భాజపా తరపున ఏపీలో 15 లక్షల ఇళ్లపై జెండాలు ఎగరేసేలా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా
ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా
author img

By

Published : Aug 9, 2022, 6:16 PM IST

Somu Veerraju on Har Ghar Tiranga: ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారతీయ జనతా పార్టీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం చేపట్టింది. విజయవాడ భాజుపా రాష్ట్ర కార్యాలయం నుంచి కొత్త వంతెన సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, భాజపా రాష్ట్ర ఇంఛార్జ్​ సునీల్ థియోధర్​లు జాతీయ జెండాలు చేతబట్టి ప్రచార యాత్ర నిర్వహించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగుర వేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. మువ్వన్నెల జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగువాడు కావటం మనకి గర్వకారణమన్నారు. భాజపా తరపున ఏపీలో 15 లక్షల ఇళ్లపై జెండాలు ఎగరేసేలా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

ఇవాళ్టి నుంచి ఈనెల 11 వరకు ఈ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేపట్టామని.., 12న జాతీయ నాయకుల విగ్రహాలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడతామని సోము వీర్రాజు వెల్లడించారు. 13 నుంచి హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టి 15 నాటికి ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా మెరిసిపోయేలా చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో జాతీయతా భావం పెంపొందించే కార్యక్రమం చేపట్టినందుకు ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల స్వాంతంత్య్రాన్ని సామాన్య ప్రజలు పండుగలా చేసుకునేలా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేస్తున్నామని భాజపా రాష్ట్ర ఇన్​ఛార్జ్ సునీల్ థియోధర్ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య వంటి మహనీయుల చరిత్రను నేటి తరానికి తెలియ చెబుతున్నామన్నారు. కులం, మతం, పేద, ధనిక తేడా లేకుండా అందరిలో జాతీయభావం పెంపొందించేలా ప్రధాని మోదీ జెండా పండుగ నిర్వహిస్తున్నారన్నారు. మోజార్టీ ప్రజలను భాగస్వామ్యం చేసేలా రాష్ట్రంలో ప్రచార కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.