BJP Somu Veerraju on Konaseema issue: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే గొడవలు ఎందుకు జరిగాయని భాజపా నేత సోము వీర్రాజు ప్రశ్నించారు. తమ పార్టీ 42 చోట్ల అంబేడ్కర్ పేరు పెట్టినా ఎలాంటి గొడవలు కాలేదన్నారు. ఓట్ల కోసం చేస్తున్న రాజకీయంలో భాగంగానే కోనసీమలో గొడవలు చేశారన్నారు. కొన్ని వర్గాల వారిని కావాలనే రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మంత్రి ఇల్లు తగులబెడితే హోమంత్రి, డీజీపీ వెళ్లి పరిశీలించరా? అని ప్రశ్నించారు. కోనసీమలో జరిగిన ఘటనపై ప్రభుత్వం నివేదిక ఎందుకు నివేదిక తెప్పించుకోవడం లేదన్నారు. విశ్రాంత న్యాయమూర్తితో విధ్వంసంపై ఎందుకు విచారణ జరిపించడం లేదని నిలదీశారు. రాజమహేంద్రవరంలో "గోదావరి గర్జన" పేరుతో ఈనెల 7న సభ జరగనుందని, ఈ బహిరంగ సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా రానున్నారని తెలిపారు.
ఇవీ చదవండి :