ETV Bharat / city

ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని పునరాలోచించండి : కన్నా - సీఎం జగన్‌కు లేఖ రాసిన కన్నా

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టే ఆంగ్లమాధ్యమంపై ... ఇతర రాష్ట్రాలు మాతృభాాషాభివృద్ధికి చర్యలు తీసుకుంటుంటే... ముఖ్యమంత్రి భిన్నంగా వ్యవహరిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

ఒక్కసారిగా ఆంగ్లమాధ్యమం అంటే విద్యార్థులు తట్టుకోగలరా?
author img

By

Published : Nov 8, 2019, 12:00 AM IST

వచ్చే విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టబోతున్నామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని దుందుడుకుతనంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాసిన కన్నా... కూలంకష చర్చ జరగకుండానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. మిగతారాష్ట్రాలు మాతృభాషాభివృద్ధికి చర్యలు తీసుకుంటుంటే వైకాపా ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటేనే విద్యార్థుల్లో సృజన పెరుగుతుందన్న కన్నా... ఒక్కసారిగా తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమం అంటే విద్యార్థులు తట్టుకోగలరా అని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ఇళ్లల్లోనూ ఆంగ్ల మాధ్యమానికి అనుకూల వాతావరణం ఉండదన్న కన్నా... దీని వల్ల విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగి పాఠశాల మానేసే ప్రమాదముందని హెచ్చరించారు. అక్షరాస్యత, విద్యాప్రమాణాల్లో ఇప్పటికే అడుగున ఉన్న రాష్ట్రం మరింత అధ్వాన స్థితికి చేరుతుందన్నారు. రాష్ట్రంలో కోట్లాది మంది మనోభావాలను, గ్రామీణ విద్యార్థుల భవితవ్యాన్ని పరిగణనలోకి తీసుకుని... ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ సూచించారు.

ఇవీ చదవండి

'కార్మిక కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారమివ్వాలి'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.