ETV Bharat / city

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్

Lepakshi Knowledge Hub lands scam లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్ చేసింది. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం 500 కోట్ల రూపాయలకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్‌గా భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్
లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్
author img

By

Published : Aug 24, 2022, 5:14 PM IST

BJP demands CBI inquiry into Lepakshi lands scam: లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తు చేస్తే జగన్ పునాదులు కదలడం ఖాయమని భాజపా నేతలన్నారు. దాదాపు 4 వేల 200 ఎకరాల భూములు కేవలం రూ.500 కోట్లకు కట్టబెట్టడం అతిపెద్ద స్కామ్‌గా భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు, విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

లేపాక్షి నాలెడ్జ్‌ హబ్ కుంభకోణం నేపథ్యమిదీ..: వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అస్మదీయుల కంపెనీ అయిన ఇందూ గ్రూపునకు అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ పేరుతో కారుచౌకగా అత్యంత విలువైన భూములను కట్టబెట్టారు. అందుకు నజరానాగా ఆ కంపెనీ వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేసిన సంస్థలో పెట్టుబడులు పెట్టింది. సీబీఐ విచారణలో ఈ కుంభకోణం వెలుగు చూడటంతో ఆ భూముల్ని ఈడీ జప్తు చేసింది. అప్పటికే వాటిని తనఖా పెట్టి తీసుకున్న వేల కోట్ల రుణాల్ని తిరిగి చెల్లించలేదు. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.వేల కోట్ల విలువైన ఆ భూములు.. దివాలా ప్రక్రియ రూపంలో తాజాగా మళ్లీ జగన్‌ దగ్గరి బంధువుల కంపెనీ చేతికే దక్కుతున్నాయి. అదీ అత్యంత చౌకగా.. కేవలం రూ.500 కోట్లకే దక్కనున్నాయి.

పథకాలు నిలిపివేత: భాజపా సభ్యులని తెలియగానే రాష్ట్రంలో పథకాలు తీసేస్తున్నారని జీవీఎల్ ఆరోపించారు. రేషన్ కార్డుల, పింఛన్‌ తొలగిస్తున్నారన్నారు. భారీగా ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కావాలని జాబితా నుంచి తొలగించారని.., దీన్ని పర్యవేక్షించాలని ఎలక్షన్ కమిషన్‌ను కోరినట్లు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా చేసినట్లు రుజువైతే చర్యలు చేపట్టాలన్నారు. లిక్కర్ స్కామ్‌పై దిల్లీలో డొంక కదిలితే తెలుగు రాష్ట్రాల్లో అలజడి మెుదలైందని జీవీఎల్‌ అన్నారు. రెండు అధికార పక్షాలకు సంబంధమున్నట్లు సమాచారముందని ఆరోపించారు.

లేపాక్షి నాలెడ్జ్ హబ్‌ భూదోపిడీపై సీబీఐ విచారణకు భాజపా డిమాండ్

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.