ETV Bharat / city

'ఎయిడెడ్ విద్యాసంస్థల నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర'

author img

By

Published : Nov 11, 2021, 8:01 PM IST

ఎయిడెడ్‌ విద్యా సంస్థల నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత రెండున్నరేళ్లుగా విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు ప్రవర్తిస్తోందని భాజపా దుయ్యబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరించారు.

సి.హెచ్ బాబు రావు
సి.హెచ్ బాబు రావు

ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల విషయంలో ముఖ్యమంత్రి పట్టుదల వీడాలని.. ఆ విద్యాసంస్థల్లో చదువుతున్న పేద విద్యార్ధుల శ్రేయస్సు దృష్ట్యా ఎయిడెడ్​పై జారీ చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయనగరంలో జరిగిన సీపీఐ జిల్లా కార్యదర్శులు, ప్రజా సంఘాల అధ్యక్ష, కార్యదర్శుల వర్క్ షాప్ కార్యక్రమానికి రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వ వాదనకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలకు పొంతన లేదన్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలోని భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ ప్రస్తుతం మూతపడడం విచారకరమన్నారు. రైతులంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై రామకృష్ణ మండిపడ్డారు.

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఎయిడెడ్‌ విద్యా సంస్థల నిర్వీర్యానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని భాజపా ఆరోపించింది. గత రెండున్నరేళ్లుగా విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్లు ప్రవర్తిస్తోందని దుయ్యబట్టింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం ద్వారా వాటిని విక్రయించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించింది. కేరళలో ఎయిడెడ్‌ స్కూళ్లలో టీచర్లు కొరత ఉంటే- అక్కడి ప్రభుత్వం డిప్యుటేషన్‌పై టీచర్లను పంపించి విద్యా వ్యవస్థను కాపాడుతుంటే- ఇక్కడ అందుకు విరుద్ధంగా ఉంటోందని పేర్కొంది.

అమ్మ ఒడి పథకాన్ని ఇస్తున్నామని చెబుతోన్న రాష్ట్ర ప్రభుత్వం- అమ్మకానికి బడులు అన్నట్లుగా ఎయిడెడ్‌ విద్యా సంస్థల పట్ల వ్యవహరిస్తోందని... తమ పాఠశాలలను కాపాడుకునేందుకు విద్యార్ధులు ఆందోళన చేస్తే వారిపై లాఠీఛార్జి చేయడం అమానుష చర్యగా అభివర్ణించింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎయిడెడ్‌ విద్యా సంస్థల విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం డిమాండ్ చేశారు.

విజయవాడ అజిత్ సింగ్​నగర్​లోని వివేకానంద సెంటినరీ హైస్కూల్​ను ఎయిడెడ్ స్కూల్​గా కొనసాగించాలని సీపీఎం నేత సీహెచ్ బాబూరావు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం తగదని ఆయన హితవు పలికారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు వెంటనే స్పందించాలని, లేదంటే ప్రజా ఆందోళన తప్పదని బాబూరావు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. పంచ్​ ప్రభాకర్​పై సీబీఐ ఛార్జిషీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.