BJP celebrations: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము గెలుపుతో.. భాజపా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో గురువారం రాత్రి విజయోత్సవం నిర్వహించారు. కన్వీనర్ రంగబాబు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కేక్ కోసి హర్షం వ్యక్తం చేశారు. తొలుత రామాలయం కూడలిలోని అల్లూరి చిత్రపటానికి సోము వీర్రాజు పూలమాల వేసి నివాళులర్పించి, విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా భాజపా పాలన సాగుతోందన్నారు. ప్రధాని మోదీ సామాజిక న్యాయం పాటిస్తూ గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా నిర్ణయించడం, ఆమె అఖండ మెజార్టీతో గెలుపొందడం దేశం గర్వించదగ్గ పరిణామమన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా ఓటు వేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
* రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము విజయం సాధించటంతో విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
ఇవీ చదవండి: