ETV Bharat / city

స్థానిక సమరం: భాజపా, జనసేన జట్టుగా బరిలోకి

స్థానిక సమరంలో అన్నిస్థానాల్లో కలిసి పోటీచేయాలని భాజపా, జనసేన నిర్ణయించాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సమన్వయంపై సమాలోచనలు జరిపిన ఇరుపార్టీల నాయకులు.. ఈనెల 12 న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

భాజపా, జనసేన జట్టుగా బరిలోకి
భాజపా, జనసేన జట్టుగా బరిలోకి
author img

By

Published : Mar 9, 2020, 5:53 AM IST

జనసేన, భారతీయ జనతా పార్టీల పొత్తు ఖరారయ్యాకు తొలిసారిగా ఎన్నికల బరిలోకి కలిసి దిగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాయి . అధికార పార్టీ తప్పులనే తమ అజెండాగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఎవరికి ఎక్కడ ఎంత బలం ఉందనే అంశంతో పాటు కొన్ని స్థానాల విషయంలో సర్దుబాటు ధోరణిలో వెళ్లాలనే అభిప్రాయానికి వచ్చారు. సమయం తక్కువగా ఉన్నందున త్వరగా ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై చర్చ జరిగింది. ప్రభుత్వం కావాలనే తక్కువ సమయం ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తోందని అభిప్రాయపడ్డారు.

సమన్వయ కమిటీలు ఏర్పాటు

ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో 2 పార్టీల ఇన్‌ఛార్జుల ఆధ్వర్యంలో సమన్వయ కమిటీలు ఏర్పాటుకు నిర్ణయించారు. శాసనసభ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జుల నుంచి పేర్ల ప్రతిపాదన తీసుకుని 2 పార్టీలు స్థానికంగానే నిర్ణయించుకుని ఎవరు పోటీ చేయాలనేది అక్కడికక్కడే ఖరారు చేసేయాలని నిర్ణయించారు. ఆయా పార్టీల బీ ఫాంలు జిల్లా స్థాయిలోనే అభ్యర్థులకు తక్షణమే అందజేసే ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ, మండలస్థాయి నుంచి సమన్వయం ఉండేలా చూసుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మార్చి 12న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన నుంచి పవన్‌కల్యాణ్, భాజపా నుంచి ఆ పార్టీ జాతీయ నేత ఒకరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లో జనసేన తరపున సమన్వయం చేసేందుకు జిల్లాలవారీగా సమన్వయకర్తలను పార్టీ ప్రకటించింది. నామినేషన్‌ దశ నుంచి పోలింగ్‌ ప్రక్రియ వరకూ పార్టీ కార్యక్రమాలను వీరు సమన్వయం చేయనున్నారు.

భాజపా, జనసేన జట్టుగా బరిలోకి

ఇదీచదవండి

పురపాలిక, నగర పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు..ఎన్నికలకు నేడు ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.