Biodiversity Board WorkShop: రాష్ట్రంలోని జలవనరుల జీవవైవిధ్యం, పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా బయో డైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలను నియమించిందని వెల్లడించారు. విజయవాడలో ఏపీ బయోడైవర్సిటీ బోర్డు నిర్వహించిన వర్క్ షాప్లో ముఖ్యఅతిథిగా మంత్రి బాలినేని పాల్గొన్నారు.
సముద్ర తీరప్రాంతంలోని జీవవైవిధ్యంతోపాటు కొల్లేరు, పులికాట్ సరస్సులు, ఇతర నీటి వనరుల వద్ద ఉన్న జీవావరణాన్ని సంరక్షించే చర్యలు ముమ్మరం చేస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అంతకుముందు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్, కార్యదర్శులతో కలిసి ప్రచార పుస్తకాలను మంత్రి ఆవిష్కరించారు. మరోవైపు తిరుపతిలోని శేషాచలం అటవీ ప్రాంతాల్లో 30 ఏళ్ల క్రితం నాటిన ఆస్ట్రేలియన్ తుమ్మ చెట్లు ప్రస్తుతం అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయని బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ బీఎంకే రెడ్డి అన్నారు. వీటిని దశలవారీగా తొలగించి స్థానిక వృక్షజాతులు నాటేందుకు తితిదే ముందుకొచ్చిందని ఛైర్మన్ వివరించారు.
ఇదీ చదవండి: Jagannadhastakam CD: ‘జగన్నాథాష్టకం’ సీడీని విడుదల చేసిన ఉపరాష్ట్రపతి