ETV Bharat / city

Humanity: తప్పిపోయిన తల్లి..కుమారుల వద్దకు చేర్చిన ఛత్తీస్​గఢ్ పోలీసులు - Bastar police escort missing mother to sons

ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని బస్తర్(basthar) పోలీసులు మానవత్వం చాటుకున్నారు. కుమారుల నుంచి తప్పిపోయి ఒంటరిగా తిరుగుతున్న మహిళను తిరిగి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. తప్పిపోయిన తల్లిని తిరిగి తమకు అప్పగించినందుకు బస్తర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

తప్పిపోయిన తల్లిని కుమారుల వద్దకు చేర్చిన బస్తర్ పోలీసులు

author img

By

Published : Jun 25, 2021, 7:18 PM IST

మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళను ఛత్తీస్​గఢ్ రాష్ట్రంలోని బస్తర్ పోలీసులు.. కుమారుల వద్దకు చేర్చారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు మతిస్థిమితం సరిగా లేదు. ఎనిమిది నెలల క్రితం ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబీకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో దేవరపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రమంలో.. బస్తర్​లో అనుమానాస్పదంగా తిరుగతూ, తెలుగులో మాట్లాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారి సమాచారంతో మహిళను చేరదీసిన పోలీసులు ఆమె వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. తప్పిపోయిన తల్లిని.. తిరిగి తమ వద్దకు చేర్చిన పోలీసులకు బాధితురాలి కుమారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీచదవండి.

NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.