ETV Bharat / city

'తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిస్తే... చూస్తూ ఊరుకోబోం' - పోతిరెడ్డిపాడు తాజా వార్తలు న్యూస్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ నల్లజెండాలు ఎగురవేశామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పేర్కొన్నారు. కృష్ణానదీ జలాలను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ వైఫల్యం చెందారని ఆరోపించారు.

bandi-sanjay-talk-about-pothireddy-padu-issue-in-hyd

author img

By

Published : May 16, 2020, 2:54 PM IST

Updated : May 16, 2020, 5:00 PM IST

కృష్ణానదీ జలాలను కాపాడటంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ వైఫల్యం చెందారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. కేసీఆర్​ అసమర్థతను నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నల్లజెండాలు ఎగురవేశామని తెలిపారు. కృష్ణానదిలో వాస్తవానికి తెలంగాణ వాటా 535 టీఎంసీలు ఉండాలి కానీ కేసీఆర్​ నిర్లక్ష్యం కారణంగా 299 టీఎంసీలకు పరిమితమైందని దుయ్యబట్టారు.

పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్​ శఖావత్​కు రాష్ట్ర భాజపా శాఖ తరఫున రాసిన లేఖకు ఆయన స్పందించి కేఆర్​ఎంబీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు భాజపా వ్యతిరేకం కాదని... తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతిస్తే.. చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: పోతిరెడ్డిపాడుపై రాష్ట్రాన్ని వివరాలు కోరనున్న కృష్ణా బోర్డు!

Last Updated : May 16, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.