తన పుట్టినరోజు (జూన్ 10)న శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవ్వరూ రావొద్దని సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఏటా పుట్టినరోజు (birthday)న తనను కలిసేందుకు తరలివస్తున్న అభిమానులకు సర్వదా విధేయుడినని చెప్పారు. కరోనా విలయతాండవం చేస్తోన్న ఈ విపత్కర పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. అభిమానుల ఆరోగ్యాన్ని మించిన శుభాకాంక్షలు లేవన్న బాలకృష్ణ.. విపత్కాలంలో అసువులు బాసిన అభిమానులు, కార్యకర్తలకు నివాళులర్పించారు.
ఇదీ చదవండి: ap high court: కొవిడ్ నియంత్రణ చర్యలపై విచారణ.. కేంద్రం అఫిడవిట్‌పై అసంతృప్తి!