బహుజనులు అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి పనులు చేపడతారన్నది తెలిపేందుకు.. మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు బహుజన నేత పరమశివన్ తెలిపారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అధిక సంఖ్యాకులు ఉన్న బహుజనులు రాష్ట్ర పగ్గాలు చేపడితే మార్పు ఖాయమన్నారు. విజయవాడలోని బసవపున్నయ్య భవన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అసెంబ్లీని పోలి ఉండే విధంగా ఏర్పాట్లు చేసి... కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలుగా ఇందులో పాల్గొని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ నిర్ణయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరమశివన్ తెలిపారు. నూతన ఆలోచనలతో ప్రభుత్వాన్ని ఏవిధంగా నడిపించాలన్నదీ మాక్ అసెంబ్లీలో చర్చించామని చెప్పారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో 2 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు... ఆ జిల్లాలోనే అత్యధికం!