విజయవాడ చిట్టినగర్‌లో పాల ఫ్యాక్టరీ వద్ద ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహేశ్ అనే యువకుడిపై కొందరు యువకులు విచక్షణారహితంగా దాడి చేశారు. సీసీ కెమెరాలో దాడి దృశ్యాలు నమోదయ్యాయి. దుండగుల చేతిలో గాయపడిన మహేశ్‌ను చికిత్స నిమిత్తం హెల్ప్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులు పరారీలో ఉన్నారు.
గంజాయి లేదా బ్లేడ్ బ్యాచ్ పనిగా పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీచదవండి