జనసేన కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
విజయవాడలో జనసేన కార్యకర్తపై దాడి జరిగింది. రిక్షాపై ఇంటికెళ్తుండగా వేరే పార్టీ జెండా పెట్టుకుని వెళ్లాలని.. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదినట్లు బాధితుడు తెలిపాడు.
జనసేన కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తపై దాడి కలకలం రేపింది. ప్రచారం ముగించుకునిరిక్షాపైవెళ్తుండగా గుర్తు తెలియని ఐదుగురు వ్యక్తులు అడ్డగించి కొట్టినట్టు బాధితుడు కోటేశ్వరరావు తెలిపాడు. వేరే పార్టీ జెండా కట్టి తీసుకెళ్లాలని బలవంతం చేశారని... నిరాకరించిన తనపై దాడి చేసి.. రిక్షానుతగలబెట్టారని ఆరోపించాడు. క్షతగాత్రుణ్ణి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఇవీ చూడండి.
యాంకర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో ప్రముఖ పార్టీలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నాయి. టీడీపీ నుంచి సిట్టింగ్ మంత్రి అయ్యన్న పాత్రుడు పోటీలో ఉండగా, వైస్సార్సీపీ నుంచి ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు ఉమా శంకర్ గణేష్ తల పడుతున్నారు. వీరికి సంబంధించి ఎవరికి వారే ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే వైస్సార్సీపీ అభ్యర్థి గణేష్ కి మద్దతు గా ఇప్పటికే పూరీ జగన్నాథ్ మరో సోదరుడు, ప్రముఖ్ సినీ హీరో సాయిరామ్ శంకర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేస్తూ సోదరుడు గెలుపు కోసం తిరుగుతున్నారు. తాజాగా తనయుడు గణేష్ గెలుపు కోసెం ఆయన తల్లి సత్యవతి ప్రచారం చేయడం విశేషం. నడవలేని వయసులో కూడా కుమారుడిని గెలిపించాలని గ్రామాల్లో పర్యటించి ఓట్లను అభ్యర్థి స్తున్నారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోని గోలుగొండ మండలం జోగంపేట, మల్లంపేట తదితర గ్రామాల్లో ఓటర్లను గెడ్డం పట్టుకుని మరీ అడుగుతున్నారు.OVER