MLA Mekapati Vikram Reddy Meets CM Jagan: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ది, సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మేకపాటి విక్రమ్ రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు.
ఉపఎన్నికల ఫలితాలు సహా పలు అంశాలపై సీఎంతో చర్చించినట్లు విక్రమ్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రాంత అభివృద్దికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం ముందు ఉంచగా.. ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. తన సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగిస్తానన్నారు. మేకపాటి కుటుంబానికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అంశం సీఎంతో సమావేశంలో చర్చకు రాలేదన్నారు. 'తాను ఇప్పుడే ఎమ్మెల్యే అయ్యాను.. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది' అని విక్రమ్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: