గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడు ఘటనపై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలాల గుండా విద్యుత్ లైన్లు వేశారని అడిగిన తెలుగుదేశం నేతలపై కేసులు పెడతారా అని నిలదీశారు. ఇళ్ల నిర్మాణాల కంటే.. ప్రతిపక్షాలను వేధించడంపైనే వైకాపా దృష్టి సారిస్తోందని మండిపడ్డారు. వైకాపా నేతలు తెలుగుదేశం శ్రేణుల జోలికొస్తే ఊరుకోమన్నారు. పోలీసులు ఖాకీ చొక్కాతీసి నీలిరంగు పులుముకోవడం మంచిదని హితవు పలికారు. అరెస్టు చేసిన తెలుగుదేశం నేతలను వెంటనే విడుదల చేయాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కంభంపాడులో వైకాపా,తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ