విజయవాడ దుర్గమ్మకు ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని నేటి నుంచి భక్తుల సారె సమర్పణ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, కార్య నిర్వహణాధికారి సురేష్‌బాబు తొలిసారెను శాస్త్రోక్తంగా అమ్మవారికి సమర్పించారు. జులై 20వ తేదీ వరకు భక్తులు సారె సమర్పించవచ్చని వైదిక కమిటీ తెలిపింది. చివరి రోజున వైదిక కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సారెను సమర్పిస్తారు.
కరోనా నేపథ్యంలో అమ్మవారికి సారె సమర్పించదలిచిన భక్తులు, సంస్థలు ఉదయం ఆరు గంటల నుంచి ఐదు గంటల లోపు ఆన్‌లైన్‌లో దర్శనం శ్లాట్ బుక్ చేసుకుని రావాలని అధికారులు కోరారు. పరిమిత సంఖ్యలో భక్తులు మాస్కులు ధరించి శానిటైజర్ ఉపయోగించి అమ్మవారికి సారె సమర్పణకు రావాలని దేవస్థానం పాలకమండలి సూచించింది.
ఇదీ చూడండి..