ETV Bharat / city

'భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తి' - indrakeeladri latest news

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని దుర్గగుడి ఛైర్మన్ తెలిపారు. అధికారిక వెబ్​సైట్​, మెుబైల్​ యాప్​ ద్వారా ఆన్​లైన్​లో స్లాట్​ బుక్​ చేసుకోవాలని చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కొవిడ్​ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

arrangements-for-bhavani-deeksha-viramana-are-completed-in-indrakeeladri-krishna-district
'భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తి'
author img

By

Published : Jan 4, 2021, 10:00 AM IST

Updated : Jan 4, 2021, 11:57 AM IST

భవానీ దీక్షల విరమణకు ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లు పూర్తయ్యాయని దుర్గగుడి ఛైర్మన్ తెలిపారు. ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు దీక్ష విరమణలుంటాయని ఆలయ ఈవో చెప్పారు. ఈ ఏడాది కరోనా కారణంగా రోజుకు 10వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతినిస్తుట్లు అధికారులు తెలిపారు. గిరిప్రదక్షణ, కేశఖండన, నదీస్నానాలకు అనుమతిలేదన్నారు. మాలలను స్థానికంగా ఉన్న గురుస్వాముల వద్ద విరమణ చేసుకోవాలని అధికారులు సూచించారు.

క్యూలైన్ల ఏర్పాట్లు పూర్తైందని దుర్గగుడి ఛైర్మన్​ తెలిపారు. ఆలయ పాలకమండలి, అధికారులు సమన్వయంతో భక్తులకు ఇబ్బంది లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. దీక్షల విరమణకు సంబంధించి ప్రెస్​నోట్​ రిలీజ్​ చేశామని.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు తెలియజేయాల్సిందిగా మీడియాని కోరారు.

ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చేవారు కొవిడ్​ పరీక్షలు చేయించుకుని రావాల్సిందిగా ఆలయ ఈవో కోరారు. భక్తులు సహకరించాలని.. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. website: www.kanakadurgamma.org , Mobile App: kanakadurgammaలో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని ఆలయ ఈవో తెలిపారు.అమ్మవారి దర్శనానికి ఉదయం నాలుగు నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు. మొదటి రోజున మాత్రం ఉదయం 5:30 గంటలకు దర్శనం ప్రారంభమవుతుందన్నారు. చండీహోమంలో పాల్గొనే భక్తులకు ఇంటికే ప్రసాదాలు పంపిస్తామన్నారు. హోమానికి సంబంధించిన టికెట్లు వెబ్​సైట్​లో బుక్​ చేసుకోవాలని కోరారు.

"దీక్షా విరమణలు ఈ నెల 5 నుంచి 9 వరకు ఉంటాయి. అవసరాన్ని బట్టి పదవ తేదీ వరకు పొడగిస్తాం. అమ్మవారి దర్శనము ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు కల్పిస్తాం. దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా మాస్కులు ధరించి.. భౌతిక దూరము పాటించాలి. కొవిడ్ నిబంధనల కారణంగా 10 సంవత్సరములలోపు పిల్లలు, 65 సంవత్సరముల పైబడినవారు, దివ్యాంగులు, వృద్ధులు, గర్బిణీ స్త్రీలు దర్శనమునకు అనుమతి లేదు. అంతరాలయ దర్శనము పూర్తిగా నిలుపుదల చేశాం" -పైలా సోమినాయుడు, దుర్గగుడి ఛైర్మన్

"అమ్మవారి దర్శనానికి ఆన్​లైన్​లో టోకెన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా ఐడీ ప్రూఫ్​ తప్పకుండా వెంట తెచ్చుకోవాలి. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఒక రోజుకు 10,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తాం. క్యూలైన్లలో వచ్చే భక్తులు భౌతిక దూరాన్ని పాటించాలి. వైరస్​ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు క్యూలైన్ల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశాం. భక్తుల కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం" -ఆలయ ఈవో

ఇదీ చదవండి: శ్రీశైలంలో బైబిల్​ కలకలం... అసలు ఏం జరిగిందంటే?

Last Updated : Jan 4, 2021, 11:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.