ETV Bharat / city

MEDARAM: మరో వారంలో మేడారం మహాజాతర.. నేడే మండమెలిగే పండుగ - మండమెలిగే పండుగ

Medaram Jatara 2022: మేడారం మహాజాతరకు ముహూర్తం దగ్గరపడింది. వచ్చే బుధవారం నుంచి జనసందడి మొదలుకానుంది. వనం వీడి జనం చెంతకు... వనదేవతల ఆగమనం జరగనుంది. తెలంగాణ ముఖ్యమంత్రిని జాతరకు ఆహ్వానిస్తూ మంత్రులు పత్రికను అందించారు. మరోవైపు మేడారంలో కొద్దిరోజులుగా భక్తుల సందడి కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో... మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. జాతరకు వారం ముందుగా.... ఇవాళ జరిగే మండమెలిగే పండుగకు సర్వం సిద్ధమైంది.

నేడే మండమెలిగే పండుగ
నేడే మండమెలిగే పండుగ
author img

By

Published : Feb 9, 2022, 9:07 AM IST

నేడే మండమెలిగే పండుగ

mandameliga panduga: తెలంగాణ కుంభమేళాగా పేరొందిన సమ్మక్క సారలమ్మ జాతరకు(medaram sammakka sarakka Jatara) భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. తెలుగురాష్ట్రాలతో ఛత్తీస్​గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కుటుంబసమేతంగా వచ్చిన భక్తులు జంపన్నవాగులో స్నానాలు చేసి వనదేవతలను దర్శించుకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయలకు నెలవైన సమ్మక్క సారలమ్మ మహా జాతరకు.. రెండు వారాల ముందు నుంచి గుడిమెలిగే, మండమెలిగే పండగలు నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గత బుధవారం నాడు గుడిమెలిగే పండగను జరపి జాతరకు(Medaram Jatara) అంకురార్పణ చేసిన పూజారులు.. ఇవాళ మండమెలిగే ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

దుష్టశక్తులు తమ గ్రామాల్లోకి రావని..

ఇవాళ వేకువజామునే.. గద్దెలను కడిగి పూజలు చేసి ముగ్గులు వేసిన పూజారులు.. డోలు వాయిద్యాలు హోరెత్తుండగా.. పసుపు కుంకుమలతో ఊరేగింపు చేపట్టారు. మేడారం గ్రామం చుట్టూ.. దిష్టి తోరణాలు కట్టారు. ఇలా చేస్తే దుష్టశక్తులు తమ గ్రామాల్లోకి రావని వీరి విశ్వాసం. రాత్రి గద్దెల వద్ద అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి పూజలు చేసి జాగారాలు చేయనున్నారు. ఇందుకోసం రాత్రి సమయంలో దర్శనాలను నిలిపివేయనున్నారు. వచ్చే బుధవారం సాయంత్రం.. సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను గద్దెలపైకి తీసుకురావడంతో.. మహా జాతర(Medaram Jatara) అంగరంగ వైభవంగా ప్రారంభమవనుంది.

ఈసారి 75 కోట్ల రూపాయలతో..

మరోవైపు మహాజాతర ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ సారి 75 కోట్లు వెచ్చించి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించింది. కొవిడ్ దృష్ట్యా 30 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి.. వీటన్నింటికీ అనుసంధానంగా.. తితిదే కల్యాణ మండపంలో.. మెగా మెడికల్ క్యాంపును అధికారులు ఏర్పాటు చేశారు. గతంలో లేనంతగా.. ఈ ఏడాది జనవరి మొదటివారం నుంచే భక్తుల సంఖ్య పెరగగా.. ఈసారి కోటి 30లక్షలకు పైగా భక్తులు దర్శించుకుంటారని అధికాలు అంచనా వేస్తున్నారు. జాతరను విజయవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా.. 11వేలమంది పోలీసులు విధులు నిర్వహిస్తారని వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి తెలిపారు.

ఇదీ చూడండి: రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నా... చేతికి చిక్కలేదు.. ఎందుకంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.