పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వివిధ దశల్లో జరుతున్నందు వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో 23 శాఖలు పాల్గొన్నాయని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఎస్‌ఈసీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ఆదినారాయణ.. ఎన్నికలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ అడ్డురాదని వాదించారు.
పంచాయతీ ఎన్నికల నిమిత్తం షెడ్యూల్ ప్రకటిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 8న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్‌ఈసీ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం.. ధర్మాసనం ముందు సవాల్ చేసింది. ఇవాళ ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
ఇదీచదవండి