ETV Bharat / city

APSSDC: 6 నైపుణ్య శిక్షణ కళాశాలలకు రూ.102 కోట్లతో టెండర్లు

రాష్ట్రంలో 102 కోట్ల రూపాయలతో 6 నైపుణ్య శిక్షణ కళాశాలల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ(APSSDC) చేపట్టిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్‌టీయూ, కేఎల్‌ విశ్వవిద్యాలయం, కర్నూలు ట్రిపుల్‌ ఐటీలను ఎంపిక చేసినట్లు పేర్కొంది.

APSSDC
రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ
author img

By

Published : Sep 13, 2021, 4:20 AM IST

రాష్ట్రంలో రూ.102 కోట్ల వ్యయంతో 6 నైపుణ్య శిక్షణ కళాశాలల ఏర్పాటుకు టెండర్ల ప్రక్రియను రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్డీసీ) చేపట్టిందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ప్రతి కళాశాలలో ఆయా ప్రాంత అవసరాలకు అనుగుణంగా రెండు ప్రాధాన్య కోర్సులను ఎంపిక చేశాం. ఏడాదికి ఒక్కో శిక్షణ కేంద్రం నుంచి 1,920 మందికి శిక్షణతో పాటు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన (పీఎంకేవీవై) కింద 43,167 మందికి శిక్షణ ఇవ్వటంతో పాటు 19,446 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాం. ఈ విషయంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల చొప్పున రూ.460 కోట్లతో 25 నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేస్తాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అయిదెకరాల విస్తీర్ణంలో సుమారు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో శిక్షణ కేంద్రాలను అభివృద్ధి చేస్తాం. 126 మంది అక్కడే ఉండి శిక్షణ పొందే విధంగా వసతి గృహాలను కూడా నిర్మిస్తాం. గత రెండేళ్లలో 1.7 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వివిధ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాం’ అని పేర్కొంది. ‘ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజ సంస్థ శాంసంగ్‌ సహకారంతో శాంసంగ్‌ ప్రిజమ్‌ను రాష్ట్రంలోనూ ప్రారంభించాం. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్‌టీయూ, కేఎల్‌ విశ్వవిద్యాలయం, కర్నూలు ట్రిపుల్‌ ఐటీలను ఎంపిక చేశాం. కంప్యూటర్‌ విజన్‌, మెషీన్‌ లెర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ద కనెక్టెడ్‌ డివైజస్‌, 5జీ నెట్‌వర్క్‌ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ప్రాజెక్టులపై విద్యార్థులకు నైపుణ్యం అందిస్తాం’ అని తెలిపింది.

ఇదీ చదవండి..

శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

For All Latest Updates

TAGGED:

APSSDC
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.