ETV Bharat / city

ఏపీఎస్​ఆర్టీసీకి కౌశలాచార్య అవార్డు

మెరుగైన పనితీరుతో ఇప్పటికే పలు అవార్డులు సాధించిన ఏపీఎస్​ఆర్టీసీ.. మరో ప్రతిష్టాత్మక అవార్డును సాధించింది. అత్యధిక మంది యువతకు నైపుణ్య శిక్షణాభివృద్ధి చేసిన సంస్థలకు ఇస్తోన్న కౌశలాచార్య అవార్డును ఏపీఎస్​ఆర్టీసీకి కేంద్రం ప్రకటించింది.

author img

By

Published : Oct 5, 2020, 11:32 PM IST

ఏపీఎస్​ఆర్టీసీకి కౌశలాచార్య అవార్డు
ఏపీఎస్​ఆర్టీసీకి కౌశలాచార్య అవార్డు

దిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కౌశలాచార్య అవార్డును అందుకున్నారు. దేశంలో ఏ ఇతర ఆర్టీసీ... లేని రీతిలో నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించినందుకు గాను కేంద్రం ఈ అవార్డుతో సత్కరించింది. ఆర్టీసీలో 2016 నుంచి 2019 వరకు అత్యధికంగా 5 వేల 397 మంది ఐటీఐ అప్రెంటీస్ లను నియమించి వారికి శిక్షణ ఇచ్చింది.

మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్టు, తదితర ట్రేడుల్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా స్టైఫండ్ రూపంలో 7 వేలు అందించింది ఏపీఎస్​ఆర్టీసీ. శిక్షణ అనంతరం వారు.. ఉపాధి అవకాశాలు పొందడంలో సహకరించింది. గుర్తించిన కేంద్ర నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ కౌశలాచార్య పురస్కారాన్ని ఏపీఎస్ఆర్టీసీకి అందించింది.

ఇదీ చదవండి:

జేఈఈ అడ్వాన్స్​డ్ ఫలితాల్లో మనోళ్లు మళ్లీ సత్తా చాటారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.