ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. బస్టాండ్లు, బస్సుల్లో ప్రయాణికులు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్టీసీ ఎండీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ద్వారకా తిరుమలరావు.. మొదటి సారిగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించిన ఆయన.. ఏర్పాటు చేసిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్గో సర్వీసు పనిచేసే విధానంపై అధికారులు.. ఎండీకి వివరించారు. కార్గో సేవలను మరింత విస్తరించే విషయమై తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు.
ఇదీ చదవండి..