ETV Bharat / city

భాజపా, వైకాపా.. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి: శైలజానాథ్‌

author img

By

Published : Aug 9, 2021, 4:34 PM IST

రాష్ట్రంలో భాజపా, వైకాపా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలు, పెట్రో ధరల పెంపు తదితర అంశాలపై పార్టీ నేతలతో కలిసి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకునే చర్యను అడ్డుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు.

appc president sailajanth meet ap governor to complaint  on ysrcp government

పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌

అప్పులు, ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చేందుకే.. వైకాపా, భాజపా నేతలు.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ విమర్శించారు. ప్రజావ్యతిరేక విధానాలు, పెట్రో ధరల పెంపు తదితర అంశాలపై కాంగ్రెస్ నేతలతో కలిసి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో భాజపా, వైకాపా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. భాజపాకు అనుకూలమేనంటూ సీఎం జగన్ చాలా సార్లు చెప్పారని శైలజానాథ్ గుర్తు చేశారు.

కరోనా కాలంలో అసంఘటిత కార్మికుల ప్రాణాలు పోయినా ప్రభుత్వాలు లెక్కచేయటం లేదని శైలజానాథ్​ విమర్శించారు. రోజువారీ కూలీలను గుర్తించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని అమ్ముకునే చర్యను అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే అక్రమ కేసులు బనాయించటం పోలీసులకు పరిపాటిగా మారిందన్నారు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ముగిసిన కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.