ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు ఏజెంట్ల బారిన పడకుండా అవగాహన సదస్సులు నిర్వహిస్తామని.. ఏపీఎన్టీఎస్ (APNRTS) ఛైర్మన్ వెంకట్ మేడపాటి తెలిపారు. గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లినవారిపై చేసిన సర్వేలో పలు మోసాలు వెలుగుచూశాయన్నారు. కొందరిని విజిటింగ్ వీసాతో తీసుకెళ్లి అక్రమంగా పనుల్లో పెడుతున్నట్లు తేలిందన్నారు. ఏజెంట్లు ఆగడాలు అరికట్టేందుకు కడప, అనంతపురం, చిత్తూరు సహా పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వెంకట్ మేడసాని తెలిపారు.
గల్ఫ్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లేటప్పుడు ఏం చేయాలి ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎటువంటి కంపెనీల్లో ఉద్యోగం చేయాలి ? సమస్యలు వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి ? ఇటువంటి అంశాలపై గల్ప్ బాధితులకు వివరించనున్నట్లు తెలిపారు. మరోవైపు కరోనా సమయంలో ఏపీఎన్నార్టీస్ నుంచి ఇచ్చిన పిలుపు మేరకు పలు దేశాల నుంచి ఎన్నారైలు స్పందించారని తెలిపారు. సుమారు రూ. 45 లక్షల విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు, మాస్కులు, వైద్య పరికరాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేసినట్లు తెలిపారు. కొవిడ్ కారణంగా ఉపాధి కోల్పోయి.. మరోవైపు పనిచేసిన కాలానికి వేతనాలు ఇవ్వకుండా పలువురు యజమానులు వేధించారని కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని సంబంధిత ఎంబసీ అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:
Fake challans: నకిలీ ఈ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్