ETV Bharat / city

'ప్రవాసాంధ్రుల రాకలో ఏపీఎన్ఆర్టీఎస్​ కీలక పాత్ర' - ఏపీఎన్ఆర్టీఎస్ లేటెస్ట్ వార్తలు

వందే భారత్ మిషన్ కింద విమానాలు ప్రారంభమైనప్పటి నుంచి 200 పైగా విమానాలలో దాదాపు 16వేల మంది ప్రవాసాంధ్రులు స్వదేశానికి తిరిగివచ్చినట్లు ఏపీఎన్ఆర్టీఎస్ తెలిపింది. వారి రాకలో సంస్థ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొంది.

apnrts
'ప్రవాసాంధ్రుల రాకలో ఏపీఎన్ఆర్టీఎస్​ కీలక పాత్ర'
author img

By

Published : Jul 19, 2020, 4:04 PM IST

స్వదేశానికి ప్రవాసాంధ్రుల రాకలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ కీలక పాత్ర పోషించిందని... ఆ సంస్థ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ తెలిపారు. వందే భారత్ మిషన్ కింద మే 17నుంచి జులై 15 వరకు మొత్తం 212 విమానాలలో 16వేల 587 మంది ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి తిరిగి వచ్చారన్నారు. వందే భారత్ కింద విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి 21 విమానాల ద్వారా 2వేల 423 మంది , హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు124 విమానాల ద్వారా 3వేల 518, 51 ఛార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా 8వేల108, ఆమ్నెస్టీ కింద 16 విమానాల ద్వారా 2వేల 538 మంది రాష్ట్రానికి వచ్చినట్లు వెంకట్ వెల్లడించారు.

విమానాశ్రయాలకు వస్తున్న ప్రవాసాంధ్రులను రిసీవ్ చేసుకునేందుకు ఏపీఎన్ఆర్టీఎస్ టీమ్స్ సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం విమానాశ్రయంలో ప్రయాణీకులందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి, వారి ఎంపిక ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత క్వారంటైన్ కేంద్రాలు లేదా పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలకు పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవీ చూడండి-ఇంటికి తీసుకెళ్లకుండా నడిరోడ్డుపై వదిలేశారు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.