సమస్యలపై వచ్చే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఐఏఎస్ అధికారులు సమావేశం కాలేదని ఏపీ జీఈఏ సభ్యులు ఆరోపించారు. దాదాపు 70 శాతం మంది ఐఏఎస్ అధికారులు ఇదే తీరులో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొందరు ఐఏఎస్ అధికారుల వద్ద నెలల తరబడి దస్త్రాలు అపరిష్కృతంగా ఉన్నాయని... నిబంధనల ప్రకారం మూడు రోజుల కంటే ఒక అధికారి వద్ద దస్త్రం చర్యల కోసం ఉండకూడదని చెప్పారు. కొవిడ్-19 కారణంగా అధికారులు సచివాలయానికి రావడం లేదని... 30 నుంచి 50 శాతం మాత్రమే హాజరవుతున్నారని ఆరోపించారు.
ప్రతి శాఖలోనూ... క్షేత్రస్థాయి ఉద్యోగులకు కోవిడ్ పాజిటివ్ వచ్చినా సెలవు మంజూరు చేయడం లేదని... వైద్య ఆరోగ్యశాఖలో 14 రోజుల ప్రత్యేక సెలవు మంజూరుకు అంగీకారం తెలిపి 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ జీవో జారీ కాలేదని ఏపీజీఈఏ పేర్కొంది. ఆర్థిక, సాధారణ పరిపాలనశాఖల మధ్య దస్త్రాలు తిరుగుతున్నాయని... మరోవైపు క్షేత్రస్థాయి ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశించి మరీ విధులు అప్పగిస్తున్నారని సభ్యులు చెప్పారు.
ఇదీ చదవండి: