APCEO Alerts On Fake Links over Epic card with Aadhar: ఓటర్లు వారి ఆధార్ నంబర్‌తో ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు)ను అనుసంధానించాలంటూ వచ్చే నకిలీ సందేశాలకు ప్రతిస్పందించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఓటర్లు వారి ఆధార్‌ను ఓటరు ఫొటో గుర్తింపు కార్డుతో అనుసంధానించుకోవాలని పేర్కొంటూ తమకు ఎస్‌ఎంఎస్‌ల్లో లింక్‌లు వచ్చాయి’’ అంటూ తమ కాల్‌సెంటర్ (టోల్ ఫ్రీ నంబర్ 1950)కు ఫిర్యాదులు అందుతున్నాయని విజయానంద్ చెప్పారు.
APSEC News: అయితే ఎపిక్ కార్డుని ఆధార్‌తో అనుసంధానించేందుకు ఎన్నికల సంఘం ఎలాంటి లింక్‌లూ అందించట్లేదని, అలాంటి సందేశాలు పంపట్లేదని వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించి నకిలీ సందేశాలకు ప్రతిస్పందించొద్దని సూచించారు.
ఇదీ చూడండి:
CM Jagan Kadapa Tour: త్వరలో సీమ రూపురేఖలు మారిపోతాయి: సీఎం జగన్