ETV Bharat / city

పేదల జీవితాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం: శైలజానాథ్

ముఖ్యమంత్రి జగన్ తన అసమర్థ పాలనతో పేదలపై పన్నుల భారం మోపటంతో పాటు విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ మండిపడ్డారు.పేదల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు.

పేదల జీవితాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం
పేదల జీవితాలతో జగన్ ప్రభుత్వం చెలగాటం
author img

By

Published : Apr 13, 2022, 10:27 PM IST

జగన్ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ ధ్వజమెత్తారు. జగన్ తన అసమర్థ పాలనతో పేదలపై పన్నుల భారం మోపటంతో పాటు విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. వారానికో శాఖలో ఛార్జీలు, పన్నులు పెంచటం ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. పేదలు, మద్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే ఆర్టీసీలో ఛార్జీలు పెంచటం దారుణమన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రెండు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని అన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

విద్యుత్ ఛార్జీలు పెంచి ఆక్వా రంగాన్ని పట్టపగలు ఉరితీశారని శైలజానాథ్ విమర్శించారు. ఆక్వా రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకోకుండా విద్యుత్ ఛార్జీలు పెంచి పెనుభారం మోపారని మండిపడ్డారు. జగన్‌ నిర్ణయాలతో ఆక్వా రైతులు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని అన్నారు. రైతులకు మేలు చేయకపోగా వారిపై ఛార్జీల భారం మోపి అగాథంలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా చెరువుల విస్తీర్ణం ప్రాతిపదికన విద్యుత్‌ సబ్సిడీ రద్దు చేస్తూ.. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.