- ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని వైద్య చికిత్సలు.. ఆరోగ్య ఆసరా ఆర్థిక సాయం పెంపు: సీఎం జగన్
ఆరోగ్య శ్రీ పరిధిలో మరిన్ని వైద్య చికిత్సలు అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మరింత పారదర్శకంగా ఆరోగ్య శ్రీ పథకం అమలు చేయాలన్నారు. ఆరోగ్య ఆసరా కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు సీఎం వెల్లడించారు.
- 'జాబ్ క్యాలెండర్ హామీ ఏమైంది'.. సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యం విషయమై తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నిర్వీర్యమైనట్లుందని.., గ్రూప్-1 ఎంపిక తీరుపట్ల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందని ప్రశ్నించారు.
- తెదేపా 'చలో కంతేరు'...నేతలు గృహ నిర్బంధం.. పోలీసుల తీరుపై ఆగ్రహం
వెంకాయమ్మపై దాడిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ చలో కంతేరుకు పిలుపునివ్వగా.. నేతలను నిర్బంధిస్తూ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డ తెలుగుదేశం నేతలు.. తేల్చిచెప్పారు.
- అల్లూరి జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. ఐదుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి వద్ద ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
- ఈడీ కార్యాలయానికి రాహుల్.. రెండో రౌండ్ విచారణ
భోజన విరామం తర్వాత మళ్లీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు రాహుల్ గాంధీ. భోజనం కోసం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీసు నుంచి తుగ్లక్ సేన్‌లోని నివాసానికి వెళ్లిన రాహుల్ గాంధీ.. అక్కడి నుంచి సర్ గంగారామ్ ఆసుపత్రికి వెళ్లారు. సోనియా గాంధీని కలిసిన అనంతరం తిరిగి ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
- ఈడీ ముందుకు రాహుల్.. నియంతృత్వమా? 'నల్ల ఖజానా' రక్షణా?
రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు పంపడంపై కాంగ్రెస్, భాజపా వర్గాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. అక్రమాస్తులను కాపాడుకునేందుకే కాంగ్రెస్ ర్యాలీలు చేస్తోందని భాజపా మండిపడింది. కాగా, సత్యాన్ని భాజపా అణచివేయలేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు.
- 'అణ్వాయుధాలు పెంచుకునే పనిలో భారత్.. వారితో పోలిస్తే తక్కువే'
శత్రువుల నుంచి పొంచి ఉన్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలంటే దేశాల ఆయుధ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఆధునిక ఆయుధాలతో అమ్ములపొది నిండుగా ఉండాల్సిందే. అప్పుడే విజయం సాధ్యం. ఏ దేశం దగ్గరైనా అణ్వాయుధాలు ఉంటే ఆ దేశం జోలికి వెళ్లేందుకు ప్రత్యర్థి దేశాలు వెనకంజ వేస్తాయి.
- ఢమాల్ స్ట్రీట్.. రూ.7లక్షల కోట్లు ఆవిరి.. రూపాయి పతనంలో నయా రికార్డ్
అమెరికా ఫెడ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం భయాలతో దేశీయ మార్కెట్లు సోమవారం కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 1450 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 16వేల దిగువకు చేరింది. సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద దాదాపు రూ.7లక్షల కోట్లు ఆవిరైంది. మరోవైపు.. రూపాయి తొలిసారి 78 మార్క్ దాటింది.
- 'జబర్దస్త్ టీమ్ లీడర్ల కష్టం మామూలుగా ఉండదు.. 7 నిమిషాల స్కిట్ కోసం...'
తమ స్కిట్లతో ప్రేక్షకుల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తారు 'జబర్దస్త్' కమెడియన్స్. స్టేజ్ ఏదైనా అదిరిపోయే పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టిస్తారు. అయితే వీరిలో కొంతమంది తమ ప్రతిభతో టీమ్లీడర్లుగా ఎదిగారు. తాజాగా ఈటీవీ భారత్‌తో ముచ్చటించిన వీరు.. తమ స్కిట్లను రూపొందించడానికి ఎంతలా కష్టపడతారో వివరించారు. ఆ సంగతుల్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
- చరిత్ర సృష్టించిన తెలుగు కుర్రాడు.. తొలి భారత బాక్సర్‌గా ఆ ఘనత
మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పసిడి పట్టాడు తెలుగు కుర్రాడు గురునాయుడు. బాలుర 55 కేజీల ఈవెంట్లో మొత్తం 230 కేజీల బరువు ఎత్తి బంగారు పతకం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM
.
ఏపీ ప్రధాన వార్తలు