రాజమండ్రికి చెందిన షేక్ సత్తార్ ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేశారని ఏపీ పోలీసు సంఘం అధికార ప్రతినిధి పాలరాజు తెలిపారు. ఆ కేసులో నిందితులకు శిక్ష పడేలా చూస్తామన్నారు. తెదేపా నేత పట్టాభి కారుపై దాడిచేసిన ఘటనలో విచారణ కొనసాగుతోందని.. ఆయన ఇంటిదగ్గర ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడంలేదని తెలిపారు. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకునేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారన్నారు. దేవాలయాల విషయంలో తెదేపా నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడే ముఠాలను గుర్తించామని మొత్తం 1093 మంది ఉన్నట్లు పాలరాజు తెలిపారు. వారిని బైండ్ ఓవర్ చేసి కేసు నమోదుచేశామన్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న నిరసన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడంలేదని, శాంతిభద్రతలకు సమస్యలు తలెత్తే ప్రదేశాల్లో మాత్రమే అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకుని నిరసనను ఆపాల్సి వస్తుంటుందని.. పాలరాజు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి లాకప్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నామని పాలరాజు వెల్లడించారు.
ఇదీ చదవండి: