ETV Bharat / city

farmer suicides in AP : రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది మూడో స్థానం! - farmer suicides in ap

AP occupies 3rd place in farmer suicides: రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని.. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

AP occupies 3rd place in farmer suicides
రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రానిది మూడో స్థానం
author img

By

Published : Dec 17, 2021, 10:36 PM IST

AP occupies 3rd place in farmer suicides: రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని.. కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. జాతీయ నేర నమోదు బ్యూరో- ఎన్​సీఆర్​బీ(NCRB) ఇచ్చిన సమాచారం ప్రకారం.. 2020లో రాష్ట్రంలో 564మంది రైతులు, 140మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు కేంద్ర హోం శాఖ రాజ్యసభకు తెలిపింది.

తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశ వ్యాప్తంగా రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కేంద్రం అనేక పథకాలు తీసుకువచ్చిందని, ఆత్మనిర్భర్ భారత్‌ కింద.. రూ.లక్ష కోట్లతో అగ్రి ఇన్‌ఫ్రాస్రక్చర్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి.. ఆర్ధిక సహకారం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఖరీఫ్‌, రబీల్లో పండే అన్ని రకాల పంటలకూ.. కనీస మద్దతు ధర కల్పించడంతోపాటు పీఎం కిసాన్‌, పీఎం ఫసల్‌ భీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు.. కేంద్ర మంత్రి వివరించారు.

ఇదీ చదవండి:

Employees Union Meets Sajjala: "పీఆర్‌సీపై సీఎం ఆ రోజే నిర్ణయం తీసుకుంటారు"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.